వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రవీంద్రారెడ్డిపై ఐటీడీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-09-30T03:31:30+05:30 IST

కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీంద్రారెడ్డిపై ఏలూరు టూటౌన్ పీయస్‌లో ...

వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ రవీంద్రారెడ్డిపై ఐటీడీపీ ఫిర్యాదు

ఏలూరు (Eluru): కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ (Ycp) సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీంద్రారెడ్డిపై ఏలూరు టూటౌన్ పీయస్‌లో ఐటీడీపీ (Itdp) అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఫిర్యాదు చేశారు. నెలరోజులుగా తనపైనా, టీడీపీ మహిళలపైనా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆమె ఆరోపించారు. అయితే ఫిర్యాదు చేసేందుకు మూడు గంటల పాటు పీయస్ దగ్గర నిరీక్షించాల్సి వచ్చిందని ఉండవల్లి అనూష తెలిపారు. ఎస్సై, సీఐ లేరని, వారు లేకుండా ఫిర్యాదు తీసుకోకూడదని సిబ్బంది చెప్పారని ఆమె పేర్కొన్నారు. చివరకు ఎస్ఐ వచ్చి ఫిర్యాదు తీసుకున్నారని అనూష చెప్పారు.


Read more