-
-
Home » Andhra Pradesh » Is it wrong to say that photos should be taken-NGTS-AndhraPradesh
-
ఫొటోలు తీసి పెట్టాలని చెప్పడం తప్పా?
ABN , First Publish Date - 2022-08-17T08:57:05+05:30 IST
విజయనగరం జిల్లా కరకాం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులపై మంత్రి బొత్స ఆగ్రహం
చీపురుపల్లి, ఆగస్టు 16: విజయనగరం జిల్లా కరకాం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామానికి వచ్చిన మంత్రికి కొంతమంది గ్రామస్థులు ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. తమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోయారని చెప్పారు. ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని, అదేమని అడిగితే విపరీతమైన పనుల ఒత్తిడితో ఉన్నామంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు. పాఠాలు చెప్పని కారణంగానే పిల్లలు బడిని విడిచి వెళ్లారని వివరించారు. దీనిపై ఆగ్రహించిన మంత్రి పాఠశాల స్థితిగతులపై ఫొటోలు తీసి పెట్టాలని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఆ పనికి ఎంత సమయం పడుతుందన్నారు. వెంటనే ఎంఈవోను పిలిచి సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.