‘సబల’ షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-31T08:52:01+05:30 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాచరణ-2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర(షార్ట్‌ ఫిల్మ్‌) రాష్ట్ర స్థాయి పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటన లో

‘సబల’ షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాచరణ-2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర(షార్ట్‌ ఫిల్మ్‌)  రాష్ట్ర స్థాయి పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటన లో తెలిపారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘు చిత్రాలు తీసి పంపాలని ఆమె కోరారు. కమిషన్‌ నియమించిన జ్యూరీ పరిశీలన తర్వాత ఉత్తమ లఘుచిత్రాల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతి రూ. లక్ష, ద్వితీయ బహుమతి రూ. 50 వేలు, తృతీయ బహుమతి రూ. 25 వేలు, ఐదు ప్రత్యేక బహుమతులు రూ.20 వేల చొప్పున, వ్యక్తిగత బహుమతులు రూ.20 వేల చొప్పున అందజేయనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబరు 25లోగా ్చఞఠీఛిటజిౌట్టజజీజూఝ2022ఃజఝ్చజీజూ.ఛిౌఝ   మెయిల్‌కి పంపాలన్నారు.

Read more