మెడికల్‌ బిల్లులపై విచారణ చేపట్టండి: ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-11-23T03:44:49+05:30 IST

: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ బిల్లులపై విచారణ జరిపించాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు.

మెడికల్‌ బిల్లులపై విచారణ చేపట్టండి: ఏపీటీఎఫ్‌

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ బిల్లులపై విచారణ జరిపించాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు. రూ.50వేలు దాటినందున సుమారు 1600 బిల్లులను తిరిగి పాఠశాల విద్యాశాఖకు పంపినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు.. పెండి ంగ్‌ బిల్లులు లేవని పాఠశాల విద్య అధికారులు అంటున్నారని, అందువల్ల విచారణ జరపాలని కోరారు.

Updated Date - 2022-11-23T03:44:49+05:30 IST

Read more