వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదు

ABN , First Publish Date - 2022-10-14T08:38:04+05:30 IST

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి  భంగపాటు తప్పదు

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ 

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం), అక్టోబరు 13: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరించారు. విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నాలుగు నెలల ముందే నిర్ణయించామన్నారు. జనవాణి వాయిదా వేసుకోవాలని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కార్యక్రమానికి మంత్రి అమర్‌నాథ్‌వచ్చి ఒక సమస్యపై పవన్‌కల్యాణ్‌కు వినతిపత్రం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు ఆయన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు, వైసీపీకి రాజీనామా చేసి, సామాన్యుడిగా పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రం ఇస్తే బాగుంటుందని  అన్నారు.

Read more