దోపిడీని ఎత్తిచూపితే.. కుల మీడియా అంటారా?

ABN , First Publish Date - 2022-10-05T08:22:02+05:30 IST

దోపిడీని ఎత్తిచూపితే.. కుల మీడియా అంటారా?

దోపిడీని ఎత్తిచూపితే.. కుల మీడియా అంటారా?

అబద్ధాల్లో వీసారెడ్డి మొనగాడు: మంతెన 

అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి అరాచక పాలనను, వైసీపీ నేతల దోపిడీని ఎత్తిచూపితే.. దానిని కుల మీడియా అంటారా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. ఒక కులంపై నిత్యం విషం చిమ్ముతూ, అభూతకల్పనలతో, అసత్యాలను ప్రచురిస్తున్న జగన్‌ మీడియాను  ఏపేరుతో పిలవాలో వీసారెడ్డి చెప్పాలి’ అంటూ మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ‘ప్రజల మీడియా ఏదో, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న మీడియా ఏదో జనం గమనిస్తున్నారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక వైసీపీ దగుల్బాజీ రాజకీయం చేస్తోంది. అబద్ధాలను నిజాలుగా చిత్రించడంలో వీసారెడ్డిని మించిన మొనగాడు లేడు. ఒక ఎంపీగా ఉండి చంద్రబాబుపై నోటికివచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు.  పిచ్చికూతలు కూస్తే. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రే గతి అవుద్ది.’ అని హెచ్చరించారు. 


Read more