ఎంపీగా ఎన్నుకుంటే.. నువ్వు చేసే పని ఇదా?

ABN , First Publish Date - 2022-08-10T09:15:08+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో బయటకు రావడంతో..

ఎంపీగా ఎన్నుకుంటే.. నువ్వు చేసే పని ఇదా?

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో బయటకు రావడంతో.. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మండిపడ్డారు. ‘ఉన్నతమైన పోలీస్‌శాఖలో పని చేశావని, నిన్ను ప్రజలు ఎంపీగా ఎన్నుకుంటే.. నువ్వు చేసే పని ఇదా? నీ వికృత చేష్టలు బయట పడ్డాయని నోటికొచ్చినట్లు మాట్లాడతావా?’ అని నిలదీశారు. 

Read more