నా వీడియో నకిలీదని కాణిపాకంలో ప్రమాణం చేస్తా

ABN , First Publish Date - 2022-08-20T07:56:54+05:30 IST

నా వీడియో నకిలీదని కాణిపాకంలో ప్రమాణం చేస్తా

నా వీడియో నకిలీదని కాణిపాకంలో ప్రమాణం చేస్తా

ఓటుకు నోటు కేసులో బాబు కూడా చేస్తారా: ఎంపీ మాధవ్‌

అనంతపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా, ప్రచార మాధ్యమాల్లో వైరల్‌ అయిన తన వీడియో ఫేక్‌ అని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తానని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్‌ తనది కాదని అదే కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. అలా ప్రమాణం చేస్తే, అక్కడే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆయన శుక్రవారమికక్కడ విలేకరులతో మాట్లాడారు. ఫేక్‌ వీడియో తనదేనని నమ్మించే ప్రయత్నం చేసి దొంగలు దొరికిపోయారని, నకిలీ ఫోరెన్సిక్‌ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చి అనేక రకాలుగా సర్క్యులేట్‌ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం, సీఐడీ అధినేత అదే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు లేఖ రాస్తే ఆ రిపోర్టు తామిచ్చింది కాదని తేల్చారని, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానమిచ్చారని చెప్పారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఫేక్‌ వీడియోను అడ్డుపెట్టుకుని.. కుక్కతోకను పట్టుకుని గోదావరిని ఈదినట్లు అధికారంలోకి రావాలని చూస్తున్నాడని ఆరోపించారు.

Read more