నాది అమరావతి మొక్కు.. పాదయాత్ర పూర్తయ్యే వరకు గెడ్డం తీయను

ABN , First Publish Date - 2022-10-03T02:28:07+05:30 IST

అమరావతి పాదయాత్ర అరసవల్లి వెళ్లే వరకు తాము గెడ్డం తీసే ప్రసక్తి లేదని అమరావతి జేఏసీ కార్యదర్శి గద్దె తిరుపతిరావు అన్నారు.

నాది అమరావతి మొక్కు.. పాదయాత్ర పూర్తయ్యే వరకు గెడ్డం తీయను

నల్లజర్ల: అమరావతి పాదయాత్ర అరసవల్లి వెళ్లే వరకు తాము గెడ్డం తీసే ప్రసక్తి లేదని అమరావతి జేఏసీ కార్యదర్శి గద్దె తిరుపతిరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అయ్యవరంలో ఆదివారం  ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. యాత్ర ఆరంభం రోజు నుంచి గెడ్డంతోనే ఉన్నా.. ఇప్పటి వరకూ 21 రోజులు పూర్తయింది. నాది అమరావతి మొక్కు. ప్రభుత్వం ఎన్ని కవింపు చర్యలకు పాల్పడిన తాము గాంధీ మార్గంలోనే పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం తాము రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నట్టు పేర్కొన్నారు. నవంబరు 20వ తేది నాటికి పాదయాత్ర పూర్తవుతుందన్నారు. కోర్డు అనుమతి ఉండడం వల్ల పోలీసుల వైఖరిలో మార్పు వచ్చిందని గద్దె తిరుపతిరావు తెలిపారు.  

Read more