ఆగని అణచివేత

ABN , First Publish Date - 2022-08-31T08:02:14+05:30 IST

సీపీఎస్‌ రద్దు డిమాండ్‌తో విజయవాడలో సెప్టెంబరు ఒకటో తేదీన నిర్వహించ తలపెట్టిన మిలీనియం మార్చ్‌ వాయిదా పడినా... పోలీసులు మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులను విడిచిపెట్టడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఉదయం..

ఆగని అణచివేత

  • వాయిదా వేశామన్నా వదలని పోలీసులు
  • కొనసాగుతున్న సీపీఎస్‌ ఉద్యోగుల వేట
  • పార్వతీపురంలో ఒకేరోజు రెండుస్టేషన్లకు..
  • సీఎం ఇంటి పరిసరాల్లో తగ్గని ‘ముట్టడి’ ఉద్రిక్తత 
  • జాతీయ రహదారి వెంబడి ముళ్లకంచె
  • తాడేపల్లిలో ఆటోస్టాండ్లకు నోటీసులు 


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌) 

సీపీఎస్‌ రద్దు డిమాండ్‌తో విజయవాడలో సెప్టెంబరు ఒకటో తేదీన నిర్వహించ తలపెట్టిన మిలీనియం మార్చ్‌ వాయిదా పడినా... పోలీసులు మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయులను విడిచిపెట్టడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఏపీఎన్జీవో సంఘ నాయకులు జీవీఆర్‌ఎస్‌ కిషోర్‌, పీఆర్‌టీయూ నాయకులు అమరాపు సూర్యనారాయణ, యూటీఎఫ్‌ నాయకులు ఎస్‌.మురళీమోహన్‌రావు తదితరులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొంత సమయం తరువాత ఇంటికి వెళ్లడానికి వారిని అనుమతించారు. ఆ తర్వాత పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి... మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే ఉంచేశారు.


  • బైండోవర్‌ చేసుకుంటామని ఇద్దరు ఉపాధ్యాయులను సోమవారం రాత్రి పిలిచి మంగళవారం ఉదయం వరకు పోలీ్‌సస్టేషన్‌లోనే ఉంచారు. 
  • నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో టి.నాగన్న(47) అనే ఉపాధ్యాయుడు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉద్యమంలో పాల్గొనవద్దని రెండోరోజుల క్రితమే నాగన్నకు పోలీసులు నోటీసులు అందించారు. 
  • ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడినా... సీఎం నివాసం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉద్రిక్తత తొలగిపోలేదు. తాడేపల్లి జాతీయ రహదారి నుంచి సీఎం నివాస రోడ్డు (సర్వీసు రోడ్డు) వైపు వెళ్లే మార్గంలో ఇనుపముళ్ల కంచె ఏర్పాటుచేశారు. సీఎం నివాస చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలు, కల్యాణ మండపాలు, లాడ్జీలు, చివరకు ఆటోస్టాండ్లవారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు చెబుతున్నారు. 
  • అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సీపీఎ్‌సఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణను సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత పూచీకత్తుపై రాత్రి ఒంటి గంటకు విడిచి పెట్టారు. మళ్లీ మంగళవారం ఉదయం ఆరు గంటలకు స్టేషన్‌కు రాగా, ఎనిమిది గంటలకు విడిచిపెట్టారు. లోతుగెడ్డలో పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి చింతర్ల మధును మంగళవారం వేకువజామున నాలుగుగంటలకు పోలీసులు అదుపులోకి తీసుకుని చింతపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. వ్యక్తిగత పూచీకత్తుపై ఉదయం ఎనిమిది గంటలకు విడిచిపెట్టారు. 
  • అనంతపురం జిల్లా తాడిపత్రిలో విజయ్‌కుమార్‌, అంకాలు, మనోహర్‌, విక్టర్‌, అమీర్‌ బాషా, ధర్మవరం మండలానికి చెందిన ఏపీటీఎఫ్‌ నాయకుడు ముత్యాలప్పపై 143, 452, 342, 427, 120 తదతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు, పోలీసులు పిలిచిన వెంటనే వారి ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. 
  • అనకాపల్లి జిల్లాలోని గొలగాం ప్రభుత్వ పాఠశాలలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మంగళవారం విఽధినిర్వహణలో ఉండగా పోలీసులు వెళ్లి నోటీసు అందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావుకు, జిల్లా కార్యదర్శి కే సతీశ్‌కు కూడా తాఖీదులు అందాయి. 

Updated Date - 2022-08-31T08:02:14+05:30 IST