గంజి ప్రసాద్‌ను దారుణంగా చంపారు: హోంమంత్రి వనిత

ABN , First Publish Date - 2022-04-30T21:44:11+05:30 IST

విశాఖ ఎండాడలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.మంగళవారం దిశా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు.

గంజి ప్రసాద్‌ను దారుణంగా చంపారు: హోంమంత్రి  వనిత

విశాఖపట్నం: విశాఖ ఎండాడలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.మంగళవారం దిశా పోలీస్‌స్టేషన్‌ను  సందర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులతో హోంమంత్రి సమీక్ష జరిపారు.ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి ఘటనపైన ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..  వైసీపీ నేత గంజి ప్రసాద్‌ను దారుణంగా చంపారన్నారు. గంజి ప్రసాద్ పై దాడికి కారణాలు తెలియాల్సి ఉందని, హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. 

Read more