3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. సుప్రీంకు వెళ్తాం: సుచరిత

ABN , First Publish Date - 2022-03-04T18:41:13+05:30 IST

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమన్నారు

3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. సుప్రీంకు వెళ్తాం: సుచరిత

గుంటూరు : మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సుచరిత పేర్కొన్నారు. రాజధాని ఎక్కడుండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందన్నారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని.. కానీ అది చెప్పే వారికే అవగాహన లేదన్నారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందన్నారు. Read more