-
-
Home » Andhra Pradesh » Hijab controversy-NGTS-AndhraPradesh
-
ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం
ABN , First Publish Date - 2022-02-23T08:51:31+05:30 IST
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ప్రకాశం జిల్లాకు పాకింది. ప్రిన్సిపాల్ హిజాబ్ ధరించవద్దన్నారంటూ ఎర్రగొండపాలెంలోని వికాస్ హైస్కూల్ ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులు, ముస్లిం

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 22: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ప్రకాశం జిల్లాకు పాకింది. ప్రిన్సిపాల్ హిజాబ్ ధరించవద్దన్నారంటూ ఎర్రగొండపాలెంలోని వికాస్ హైస్కూల్ ఎదుట విద్యార్థినుల తల్లిదండ్రులు, ముస్లిం సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ సురేశ్, ఎంఈవో ఆంజనేయులు అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. కాగా, హిజాబ్ ధరించవద్దని తాను చెప్పలేదని ప్రిన్సిపాల్ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. హాజరుకు గుర్తుపట్టడం ఇబ్బందిగా ఉందని, ముఖానికి ముసుగు ధరించవద్దని మాత్రమే చెప్పానన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, హిజాబ్‌ను వివాదం చేయొద్దని అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చామని ఎంఈవో ఆంజనేయులు చెప్పారు. ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు.