సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై కేసులో హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2022-02-23T21:37:21+05:30 IST

వైఎస్‌ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి

సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై కేసులో హైకోర్టు స్టే

అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసును దర్యాప్తు  చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై నమోదు చేసిన కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాల మేరకు రామ్‌సింగ్‌పై  ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టును సీబీఐ బుధవారం ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం తదనంతర చర్యలన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది.  అధికారిపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Read more