ఎంఎల్‌హెచ్‌పీల నియామకానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-09-28T08:15:30+05:30 IST

మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌(ఎమ్‌ఎల్‌హెచ్‌పీ) నియామకానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా నియామకాలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.

ఎంఎల్‌హెచ్‌పీల నియామకానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌(ఎమ్‌ఎల్‌హెచ్‌పీ) నియామకానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా నియామకాలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. నియామకాల విషయంలో అనుసరించాల్సిన విధానంపై స్పష్టత ఇస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘డాక్టర్‌ వైస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్స్‌’లో 1681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేసేందుకు ఆగస్టు 9న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులను అర్హులుగా పేర్కొంటూ, ఆయుర్వేద వైద్యులను అనుమతించక పోవడాన్ని సవాల్‌ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎం.శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిం చారు. దీంతో నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తూ న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా వ్యాజ్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎంఎల్‌హెచ్‌పీల నియామకాలకు విషయంలో ముందుకు వెళ్లవచ్చని తీర్పు వెలువరించింది.

Read more