‘హైకోర్టు తీర్పును అమలుచేయాలి’

ABN , First Publish Date - 2022-10-12T06:36:48+05:30 IST

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూలు పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండు చేస్తూ పేద విద్యార్థుల తండ్రులు మంగళవారం అమ లాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన తెలిపారు.

‘హైకోర్టు తీర్పును అమలుచేయాలి’

అమలాపురంటౌన్‌, అక్టోబరు 11: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూలు పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండు చేస్తూ పేద విద్యార్థుల తండ్రులు మంగళవారం అమ లాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.19 విడుదల చేసి బెస్ట్‌ అవైల బుల్‌ స్కూలు పథకాన్ని రద్దు చేయడం వల్ల 50వేల మంది పేద విద్యార్థులు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువు కు దూరమ య్యారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన లో బొంతు రవికుమార్‌, దాసరి నటరాజ్‌, తాడి రాజ్‌కిరణ్‌, కుంచే రమేష్‌, విప్పర్తి రవి, జంగా ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Read more