నేడు, రేపు కూడా వర్షాలే

ABN , First Publish Date - 2022-06-07T09:51:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

నేడు, రేపు కూడా వర్షాలే

విశాఖపట్నం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పులివెందులలో 123, కాకినాడలో 112, ఒంగోలులో 92, తాళ్లరేవులో 88, పోలాకిలో 82, కావలిలో 81, పొన్నాడలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలినచోట్ల ఎండలు పెరిగి వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.

Read more