నేడు High Courtలో రాజధాని పిటీషన్లపై విచారణ

ABN , First Publish Date - 2022-07-12T13:03:31+05:30 IST

నేడు రాజధాని పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్..

నేడు High Courtలో రాజధాని పిటీషన్లపై విచారణ

అమరావతి: నేడు రాజధాని పిటీషన్లపై  హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌ల నేతృత్వంలో రాజధాని అంశంపై విచారిస్తారు.రాజధాని తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్లను న్యాయవాదులు హైకోర్టులో వేసిన విషయం తెలిసిందే. గతంలో స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. రాజధానిలో భూముల అమ్మకంపై కూడా ఈరోజు రైతుల తరపున హైకోర్టులో న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. 

Read more