మన పాలనలో అట్లుంటది మరి..!

ABN , First Publish Date - 2022-11-02T06:25:51+05:30 IST

గుంటూరు నగరంలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. గతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తవ్వి వదిలేసిన రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతో పలు

మన పాలనలో అట్లుంటది మరి..!

గోతుల రోడ్డులో బైక్‌ పైనుంచి పడిన వైసీపీ కార్పొరేటర్‌

పొన్నూరు రోడ్డు దుస్థితికి ఈ సంఘటనే ఒక నిదర్శనం

గుంటూరు (కార్పొరేషన్‌), నవంబరు 1: గుంటూరు నగరంలోని రోడ్లు గుంతలమయంగా మారాయి. గతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తవ్వి వదిలేసిన రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతో పలు ప్రధాన రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. రాత్రిళ్లు, వర్షాల సమయంలో ఆ రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఓ వైసీపీ కార్పొరేటర్‌ గోతుల రోడ్డులో బైక్‌పై నుంచి పడి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన స్థానిక పొన్నూరు రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు నగరపాలక సంస్థ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ ఆబిద్‌.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాకి స్వయానా బంధువు. ఆయన ప్రాతినిఽధ్యం వహిస్తున్న డివిజన్‌ పరిధిలోని పొన్నూరు రోడ్డులో మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అయితే గోతుల కారణంగా బండి అదుపుతప్పడంతో ఆయన కిందపడిపోయారు. దుస్తులకు బురద కూడా అంటుకుంది. ఇది గమనించిన ఓ యువకుడు పరుగున వచ్చి ఆబిద్‌ను, ఆయన బండిని పైకి లేపాడు. జగనన్న పాలనలో వైసీపీకి చెందిన కార్పొరేటర్‌కి ఈ దుస్థితి ఏర్పడిందంటే.. ప్రజలు నిత్యం ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ఈ సంఘటనే తెలియజేస్తుంది.

Updated Date - 2022-11-02T06:26:08+05:30 IST
Read more