రంగులు మార్చటం తప్ప.. అభివృద్ధి మాటేది...

ABN , First Publish Date - 2022-12-10T01:43:43+05:30 IST

పిడుగురాళ్ల, గురజాల టౌన్‌, డిసెంబరు 9: రాష్ట్రానికి జగన్‌ సీఎం అయ్యాక అభివృద్ధిని మరిచి.... రంగుల మార్చేయటం తప్ప అభివృద్ధి, జాడే లేదని గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

రంగులు మార్చటం తప్ప.. అభివృద్ధి మాటేది...
మాడుగుల జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న యరపతినేని

పిడుగురాళ్ల, గురజాల టౌన్‌, డిసెంబరు 9: రాష్ట్రానికి జగన సీఎం అయ్యాక అభివృద్ధిని మరిచి.... రంగుల మార్చేయటం తప్ప అభివృద్ధి, జాడే లేదని గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గురజాల మండలంలోని మాడుగుల జడ్పీ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల కొరతపై అక్కడి విద్యార్థులు చేస్తున్న అందోళనలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలంటే కావాల్సిన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు లేరని, మరో ఏడుగురు ఉపాధ్యాయులు అవసరమని విద్యార్థులు వివరించారు. ఇదే విషయంపై రెండు పర్యాయాలు అందోళన చేసినా సమస్య పరిష్కరించకపోగా ఉన్న ఒక్కరిని సస్పెండ్‌ చేశారని విద్యార్థులు యరపతినేనికి వివరించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను వినతిపత్రం రూపంలో యరపతినేనికి అందించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే మాడుగుల జడ్పీ పాఠశాలను 9, 10 తరగతులను అప్‌గ్రేడ్‌ చేయటం జరిగిందని, పల్నాడులో ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. ఉపాధ్యాయుల కొరతతో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు గురించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా సంబంధిత శాఖాధికారులు స్పందించకపోగా వారిని బెదిరించటం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారంలోగా టీచర్ల సర్దుబాటు చేయకుంటే తానే సొంత ఖర్చుతో ప్రైవేటు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి, అవసరమైన పుస్తకాలను అందిస్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయులు లేక ఖాళీగా ఉన్న తరగతి గదులను కలియతిరిగి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి రుచిచూశారు.

Updated Date - 2022-12-10T01:43:57+05:30 IST