AP News: మహిళలకు రక్షణ కల్పించలేని పాలన ఎందుకు? : పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-09-20T01:34:31+05:30 IST

Amaravathi : జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జగన్ (Jagan) సర్కారును టార్గెట్‌ చేశారు. ఏపీలో అత్యాచారాలు, హత్యలను అరికట్టడంతో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పాలన ఎందుకు?

AP News: మహిళలకు రక్షణ కల్పించలేని పాలన ఎందుకు? : పవన్ కళ్యాణ్

Amaravathi : జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జగన్ (Jagan) సర్కారును టార్గెట్‌ చేశారు. ఏపీలో అత్యాచారాలు, హత్యలను అరికట్టడంతో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పాలన ఎందుకు?  అని ప్రశ్నించారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. నేరాల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఏపీ కూడా ఉండడం దురదృష్టకరమన్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో మహిళలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని, నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం ఘటనలపై స్పందించాల్సిన హోమ్ మంత్రి ‘‘తల్లి పెంపకంలోనే తప్పు ఉంది. ఏదో దొంగతనానికి వచ్చి అత్యాచారం చేశారు’’ లాంటి వ్యాఖ్యలతో తేలిగ్గా మాట్లాడటం వల్లే మృగాళ్లు పేట్రేగిపోతున్నారని, దిశా చట్టం, పోలీస్ స్టేషన్లు ఆడ బిడ్డకు భరోసా ఇవ్వలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ..ఇప్పటికీ నిందితున్ని పట్టుకోలేకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు దర్పణం పడుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకీ పెరగటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-20T01:34:31+05:30 IST