‘విటమిన్‌ కే ’ లోప జన్యువుల్ని కనిపెట్టాం

ABN , First Publish Date - 2022-11-24T00:37:34+05:30 IST

మానవాళిలో విటమిన్‌-కే లోపానికి కారణమైన జన్యువుల్ని మొట్టమొద టిగా కనుగొన్నామని విజ్ఞాన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌, రీసెర్చి సలహాదారు పీబీ కవికిషోర్‌ తెలిపారు.

‘విటమిన్‌ కే ’ లోప జన్యువుల్ని కనిపెట్టాం
మాట్లాడుతున్న ఆచార్య పీవీ కవికిషోర్‌

విజ్ఞాన్‌ వర్సిటీ ప్రాఫెసర్‌ పిబీ కవికిషోర్‌

గుంటూరు(విద్య), నవంబరు 23: మానవాళిలో విటమిన్‌-కే లోపానికి కారణమైన జన్యువుల్ని మొట్టమొద టిగా కనుగొన్నామని విజ్ఞాన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌, రీసెర్చి సలహాదారు పీబీ కవికిషోర్‌ తెలిపారు. వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోదన విద్యార్థి షాలిని రాజగో పాల్‌, కేరళలోని కొల్లాం అమృత విశ్వవిద్యాపీఠం అధ్యాపకుడు డాక్టర్‌ ప్రశాంత్‌ సురవాఝల, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన ఈపరిశోధనలో విటమిన్‌-కే లోపానికి కారణమైన జన్యువుల్ని కనిపెట్టామని, ఇప్పటి వరకు ఎవ్వరూ వీటిని కనిపెట్టలేదని అన్నారు. ‘డిసెక్టింగ్‌ విటమిన్‌-కే పాత్‌వేస్‌ ఇన్‌ హ్యూమన్‌ యూజింగ్‌ నెక్ట్స్‌జనరేషన్‌ సిక్వేన్సింగ్‌ అనాలిసిస్‌’ అనే పరిశోదన ద్వారా ఈవిషయం గుర్తించి నట్లు తెలిపారు. విటమిన్‌-కే లోపానికి కారణమైన జన్యువుల్ని డయాగ్నసిస్‌ చేసి ప్యానెల్‌ను ఇండస్ట్రీస్‌ల సహాయంతో తయారుచేస్తామని అన్నారు. విటమిన్‌-కే లోపంతో మానవుల్లో ఆల్జీమర్‌, మూత్రవిసర్జన, రక్తం గడ్డకట్టక పోవడం వంటి సమస్యలు ఏర్పడ తాయని ఆచార్య పీవీ కవికిషోర్‌ తెలిపారు.

Updated Date - 2022-11-24T00:37:38+05:30 IST