బస్సు ఢీకొని తాత మనుమడు మృతి

ABN , First Publish Date - 2022-10-04T05:59:52+05:30 IST

ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో తాతామనవడు మృతి చెందారు. ఈ ప్రమాదం సోమవారం మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

బస్సు ఢీకొని తాత మనుమడు మృతి
బొబ్బా వేణుగోపాలరెడ్డి ఇందూరి మహేంద్రరెడ్డి

   వినుకొండటౌన్‌, అక్టోబరు 3: ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో తాతామనవడు మృతి చెందారు. ఈ ప్రమాదం సోమవారం మండలంలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన బొబ్బా వేణుగోపాలరెడ్డి(50) వ్వవసాయ పనులు చేస్తుంటాడు. ఆయనకు భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఇందూరి మల్లేశ్వరి, శివారెడ్డిల పెద్దకుమారుడు మహేంద్రరెడ్డి(13) వినుకొండలోని ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. సోమవారం వేణుగోపాలరెడ్డి తైవాన్‌ స్ర్పేయర్‌ రిపేరు కోసం వినుకొండకు బయలుదేరాడు. తాను కూడా వస్తానంటూ మహేంద్రరెడ్డి బయలుదేరాడు. ద్విచక్రవాహనంపై వినుకొండ వైపు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వేణుగోపాలరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మహేంద్రరెడ్డిని గుంటూరు తరలిస్తుండగా  మార్గమధ్యలో  మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ అశోక్‌బాబు తెలిపారు. 

Read more