-
-
Home » Andhra Pradesh » Guntur » tdp-NGTS-AndhraPradesh
-
వైసీపీకి త్వరలో అంతిమ యాత్ర
ABN , First Publish Date - 2022-09-13T05:37:15+05:30 IST
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర, వైసీపీకి అంతిమయాత్రలా మారనుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు
గుంటూరు(సంగడిగుంట), సెప్టెంబరు12: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర, వైసీపీకి అంతిమయాత్రలా మారనుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పశ్చిమ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సభాపతి తమ్మినేని సీతారాం రైతుల మహా పాదయాత్రను ఉన్మాదయాత్ర అంటూ వారి ఉద్యమాన్ని అవమానపరచటం తగదన్నారు. స్పీకర్ హోదాలో ఉండి కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చినప్పుటికీ అడ్డుకొని తీరతామని స్పీకర్ ప్రకటించటం చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్టుందన్నారు. చంద్రబాబు హయాంలో ఎంతో కళకళలాడిన అమరావతి, జగన్ రాకతో కళాహీనంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును కాదని ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడితే ముఖ్యమంత్రి, సభాపతి ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లక తప్పదన్నారు. వెయ్యిరోజుల నుంచి అమరావతి రైతుల ఉసురుపోసుకుంటున్న వైసీపీ పెద్దలు మట్టికొట్టుకు పోవటం తధ్యమన్నారు. ఆత్మసాక్షి సర్వేతో పాటు ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన రిపోర్టులను చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. జగన్ని అనునిత్యం జాకీలేసి లేపే ఇండియా టుడే సర్వే సైతం 80శాతం ప్రజలు ఆయన పాలన పట్ల విముఖంగా ఉన్నారని ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు వళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని కనపర్తి హెచ్చరించారు.