-
-
Home » Andhra Pradesh » Guntur » TDP president Chandrababu Fire on CM Jagan-MRGS-AndhraPradesh
-
సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
ABN , First Publish Date - 2022-07-13T23:57:24+05:30 IST
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్, అతని గ్యాంగ్ పర్యావరణ విధ్యంసానికి పాల్పడుతోందని ఆరోపించారు.చెట్లని నరికేస్తే

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్, అతని గ్యాంగ్ పర్యావరణ విధ్యంసానికి పాల్పడుతోందని ఆరోపించారు.చెట్లని నరికేస్తే పెంచొచ్చు.. కాని కొండల్ని తవ్వేస్తే ఎలా? అని సీఎంను ప్రశ్నించారు.
ముమ్మాటికి బరితెగింపే
‘‘చారిత్రాత్మక విశాఖ రుషికొండను కనుమరుగు చేయటం బరితెగింపే. పర్యావరణ విధ్వంసానికి జగన్‌కు అధికారం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 శాతం అడవుల్ని నాశనం చేశారు. ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వ్యక్తులు ముఖ్యం కాదు. సమాజమే శాశ్వతం. రవ్వల కొండను తవ్వేశారు. భారతీ సిమెంట్స్ కోసం బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరిపారు. కుప్పంలో జరిగే మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందర్ని బోనెక్కిస్తాం. ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోంది.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.