జల్లయ్య కుటుంబానికి అండగా టీడీపీ

ABN , First Publish Date - 2022-06-08T05:12:30+05:30 IST

వైసీపీ వర్గీయుల చేతిలో మృతి చెందిన జల్లయ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు.

జల్లయ్య కుటుంబానికి అండగా టీడీపీ
జల్లయ్య కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న పార్టీ నేతలు

పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

బొల్లాపల్లి, జూన్‌ 7: వైసీపీ వర్గీయుల చేతిలో మృతి చెందిన జల్లయ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. రావులాపురం గ్రామంలో మంగళవారం ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరక్షన్‌ బాబుతో కలిసి ఆయన జల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఈ సందర్భంగా జల్ల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జీవీ మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ఐదుగురిని, గురజాల నియోజకవర్గంలో తొమ్మిదిమంది టీడీపీ కార్యకర్తలను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, దీనికి సీఎం జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకొని ఈ హత్యారాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. మానవ హక్కుల కమిషన్‌తో పాటు బీసీ కమిషనర్‌ కలుగ చేసుకొని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, వినుకొండ టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పెసల వెంకట నారాయణ, జరపాల గోవిందు నాయక్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు మూరబోయిన గంగరాజు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు చెన్నుబోయిన బాలయ్య, పొదిలి శ్రీనివాసరావు, గుమ్మా గంగరాజు, షేక్‌ మాబూ సాహెబ్‌, బ్రహ్మయ్య, చెక్కా శ్రీను, చేపూరి సుబ్బారావు, మువ్వా రంగ సాయి, గడిపూడి విశ్వనాథం, గద్దె వీర మస్తాన్‌రావు, మీసాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Read more