ఎండ మండుతోంది

ABN , First Publish Date - 2022-05-24T06:12:11+05:30 IST

రోహిణి కార్తెకు రెండో రోజుల ముందునుంచే ఎండ మండుతోంది.

ఎండ మండుతోంది

41.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

 వడగాడ్పులతో నగర ప్రజల ఉక్కిరిబిక్కిరి


గుంటూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తెకు రెండో రోజుల ముందునుంచే ఎండ మండుతోంది. భానుడి ప్రతాపానికి వడగాడ్పులు జత కలుస్తుండటంతో ఉదయం 11 గంటలకే బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత చూపించింది. దాంతో మధ్యాహ్నానికి గరిష్టంగా 41.9 డిగ్సీల సెల్సియస్‌ నమోదైంది. రాత్రి అయినా వాతావరణంలో వేడి తగ్గలేదు. వాతావరణంలో గాలి వేగం 11 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో కొద్దిరోజులు వడగాడ్పులు ప్రభావం అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. 

Read more