AP News: ఎస్పీ బాలుకు ఘోర అవమానం.. వైసీపీ విగ్రహాల రాజకీయం..

ABN , First Publish Date - 2022-10-04T20:20:29+05:30 IST

గుంటూరు (Guntur): అధికారపార్టీ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతోంది.

AP News: ఎస్పీ బాలుకు ఘోర అవమానం.. వైసీపీ విగ్రహాల రాజకీయం..

గుంటూరు (Guntur): అధికారపార్టీ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతోంది. బీపీ మండల్ విగ్రహం వివాదం ముగియకముందే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనుమతి లేదని తొలగించడంపై నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలో 2 వందల విగ్రహాల వరకు అనుమతి లేదని, వాటికి లేని అభ్యంతరం బలసుబ్రహ్మణ్యం విగ్రహానికే వచ్చిందా? అంటూ మండిపడుతున్నారు.


ప్రజా సంఘాలు, కళాకారుల సంఘాలు తమ వద్దకు రాకుండా దూరం అవుతున్నారనే భావంతో దగ్గరకు చేర్చుకునేందుకు వైసీపీ నేతలు అనుసరిస్తున్న ఎత్తుగడని వారు భావిస్తున్నారు. బీపీ మండల్ విగ్రహం విషయంలో ఎలాంటి రాజకీయం అమలు చేశారో.. ఇప్పుడు ఎస్పీ బాలు విగ్రహం విషయంలో కూడా అదే రకమైన రాజకీయాన్ని అధికారపార్టీ నేతలు ఉపయోగిస్తున్నారు.


గుంటూరు, లక్ష్మిపురం సెంటర్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కళాదర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ గత రాత్రి విగ్రహాన్ని తొలగించి పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పెట్టారు. ఈ ఘటనపై సినీ కళాకారుల సంఘాలు మండిపడ్డాయి. బలసుబ్రహ్మణ్యంకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ కళాదర్బార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2022-10-04T20:20:29+05:30 IST