రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-19T05:58:03+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యా ర్థులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల యం ఎదుట జాతీయ రహదారిపై జరిగింది.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల దుర్మరణం

పెదకాకాని, సప్టెంబరు 18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యా ర్థులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల యం ఎదుట జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని రెడ్డిపాలెంకు చెందిన కే. చందు శ్రీనివాసరెడ్డి (18),ఏలూరుజిల్లా చింతలపూడికి చెందిన జె.ప్రవీనకుమార్‌(23) గుంటూరు ఆర్వీఆర్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వీరు ద్విచక్రవాహనంపై మంగళగిరి వెళ్లి తిరిగి గుంటూరు వైపు వస్తుండగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జాతీయ రహ దారిపై వారి ద్విచక్కవాహనాన్ని లారీ వెనుకభాగం తాకటంతో అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో చందుశ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లకు తీవ్రగాయాల య్యాయి. వెంటనే వారిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more