బిల్డ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌

ABN , First Publish Date - 2022-10-08T06:14:55+05:30 IST

రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు మాకొద్దని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

బిల్డ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌
వెంకటపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

1025వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 


తుళ్ళూరు, అక్టోబరు7:రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు మాకొద్దని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 1025వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని నిర్వీర్యం చేయటంతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందన్నారు. పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారదన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటానికి పాలకులు మూడు రాజధానులు తెరమీదకు తెచ్చారన్నారు. మొండివైఖరి మార్చుకోకపోతే పాలకులకు తగిన మూల్యం తప్పదన్నారు. అమరావతి రైతులను ప్రజలు ఆదరిస్తున్నారనే అక్కసుతో అమరావతి టూ అరసవల్లి పాదయాత్రను ఆపాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.

Read more