13 నుంచి గుంటూరు - డోన్‌ రైలు పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-04-10T06:15:43+05:30 IST

గతంలో దశాబ్ధాల పాటు గుంటూరు - డోన్‌ మధ్యన రాకపోకలు సాగించిన ప్యాసింజర్‌ రైలు కరోన లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ పట్టాలెక్కబోతోన్నది.

13 నుంచి గుంటూరు - డోన్‌ రైలు పునరుద్ధరణ

గతంలో ప్యాసింజర్‌ సేవలు

ఇక నుంచి ఎక్స్‌ప్రెస్‌గా కూత

గుంటూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): గతంలో దశాబ్ధాల పాటు గుంటూరు - డోన్‌ మధ్యన రాకపోకలు సాగించిన ప్యాసింజర్‌ రైలు కరోన లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ పట్టాలెక్కబోతోన్నది. ఈ రైలుని ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసి నిత్యం నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది. గుంటూరు - డోన్‌ రైలుకు నెంబరు. 17228ని కేటాయించింది. డోన్‌ - గుంటూరు రైలుకు నెంబరు. 17227ని ఇచ్చింది. కాగా నెంబరు. 17228 గుంటూరు - డోన్‌ ఈ నెల 13వ తేదీ నుంచి నిత్యం మధ్యాహ్నం 1 గంటకు బయలు దేరి 1.17కి పేరేచర్ల, 1.27కి ఫిరంగిపురం, 1.49కి నరసరావుపేట, 2.19కి వినుకొండ, 2.40కి కురిచేడు, 2.52కి దొనకొండ, 3.17కి మార్కాపురం రోడ్డు, 3.41కి కంభం, సాయంత్రం 4.17కి గిద్దలూరు, 4.34కి దిగువమెట్ట, 6.38కి నంద్యాల, మీదగా రాత్రి 9.15 గంటలకు డోన్‌ చేరుకొంటుందదిఇ. నెంబరు. 17227 డోన్‌ - గుంటూరు రైలు ఈనెల 14వ తేదీ నుంచి నిత్యం ఉదయం 6.41కి బయలుదేరి మల్కా పురం, రంగాపురం, బేతంచర్ల, బుగ్గనపల్లి సిమెంట్‌నగర్‌, కృష్ణమ్మ కోన, పాణ్యం మీదగా ఉదయం 7.43కి నంద్యాల చేరుకొంటుంది. అక్కడి నుంచి 7.38కి గాజులపల్లి, 8.31కి దిగువ మెట్ట, 8.49కి గిద్దలూరు, 9.13కి జగ్గంబొట్ల కృష్ణా పురం, 9.24కి కంభం, 10.14కి మార్కపురం రోడ్డు, 10.40కి దొనకొండ, 11 గంటలకు కురి చేడు, 11.24కి వినుకొండ, 12.15కి నరసరావు పేట, మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. ఈ రైలులో ఏసీ ఛైర్‌కార్‌, సెకండ్‌ సిట్టింగ్‌, జనరల్‌ భోగీలుంటాయి. 


Updated Date - 2022-04-10T06:15:43+05:30 IST