రైలు బోగీ.. రెస్టారెంట్‌లా..

ABN , First Publish Date - 2022-10-11T05:33:02+05:30 IST

రైలు ప్రయాణీకులతో పాటు సాధారణ పౌరుల సౌకర్యార్థం గుంటూరు రైల్వేస్టేషన్‌ తూర్పు వైపున రెస్టారెంట్‌ ఆన్‌ వీల్స్‌ - కోచ్‌ రెస్టారెంట్‌ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా అన్నారు.

రైలు బోగీ.. రెస్టారెంట్‌లా..
సకల హంగులతో రైలు బోగీ అంతర్‌భాగం

గుంటూరు రైల్వేస్టేషన్‌లో రెస్టారెంట్‌ ఆన్‌ వీల్స్‌ 

డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా

 

గుంటూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణీకులతో పాటు సాధారణ పౌరుల సౌకర్యార్థం గుంటూరు రైల్వేస్టేషన్‌(guntur railway station) తూర్పు వైపున రెస్టారెంట్‌ ఆన్‌ వీల్స్‌ - కోచ్‌ రెస్టారెంట్‌(Coach Restaurant)ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా అన్నారు. సోమవారం సాయంత్రం రైల్వేస్టేషన్‌ ఈస్టు సర్క్యులేటింగ్‌ ఏరియాలో రైలు బోగీ అభివృద్ధి చేసిన రెస్టారెంట్‌ని డీఆర్‌ఎం రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్‌ వినూత్నమైన ఆలోచనతో ఈ కోచ్‌ రెస్టారెంట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇదే ప్రప్రథమన్నారు. ఇందులో మల్టీక్యూజిన్‌, హైజీన్‌, నాణ్యమైన ఆహారం 24 గంటలు లభ్యమౌతుందన్నారు. ఒక పాత రైలు బోగీని ఇలా సకల హంగులు, ఎయిర్‌ కండీషనింగ్‌ సదుపాయంతో రెస్టారెంట్‌లా రూపుదిద్దడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఆర్‌.శ్రీనివాస్‌, సీనియర్‌ డీసీఎం వి.ఆంజనేయులు, ఏసీఎం టీహెచ్‌ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 
Read more