ప్రజలపై బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-04-05T06:18:23+05:30 IST

ప్రజలకు ఉగాది కానుకగా విద్యుత్‌ చార్జీలు పెంచి సీఎం జగన్‌ ప్రజలతో బాదుడే బాదుడు ఆట ప్రారంభించారని టీడీపీ పశ్చిమ ఇన్‌చార్జ్‌ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు.

ప్రజలపై బాదుడే బాదుడు
విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా లాంతర్లు, టార్చిలైట్లు అమ్ముతున్న పశ్చిమ టీడీపీ ఇంచార్జ్‌ నాని

టీడీపీ పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్‌ నాని

గుంటూరు (సంగడిగుంట), ఏప్రిల్‌ 4: ప్రజలకు ఉగాది కానుకగా విద్యుత్‌ చార్జీలు పెంచి సీఎం జగన్‌ ప్రజలతో బాదుడే బాదుడు ఆట ప్రారంభించారని టీడీపీ పశ్చిమ ఇన్‌చార్జ్‌ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా లాంతర్లు, టార్చిలైట్లు, అమ్ముతూ సోమవారం ఆయన వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జగన్‌ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని నమ్మబలికారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు దఫాలుగా చార్జీలు పెంచారన్నారు. టీడీపీ పాలనలో 50 యూనిట్లు ల్యాబ్‌ చార్జీలు ఉండగా అది 30 యూనిట్లకు తగ్గించడం దుర్మార్గ చర్య అన్నారు. దీనివల్ల 57 శాతం ధరల పెరుగుదలకు కారణమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్‌, నూకవరపు బాలాజి, జమ్ముల ఆంజనేయులు, పులి నాగరాజు, భాష్యం నరసయ్య, శివన్నారాయణ, రంగనాయక్‌, మధునాయక్‌, కనపర్తి శ్రీనివాసరావు, సుకవాసి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

సీపీఐ ఎంఎల్‌ ఆధ్వర్యంలో 

విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలపై మోయలేని భారం పడిందని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య తెలిపారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలంటూ సోమవారం లిబర్టీ సెంటర్‌లోని డీఈ కార్యలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలిస్తూ ఆ భారాలను ప్రజలపై మోపడం దుర్మార్గం అన్నారు. అపక్రటిత కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను తగ్గించకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ సబ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎన్‌ వి కృష్ణ, యూ గనిరాజు, రెడ్డి శ్రీను, గంధం శ్రీను, జిలాని శ్రీను, రాఘవ తదితరులు పాల్గొన్నారు. 

సీపీఐ నిరసన

పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌లను ఆదాయ వనురులుగా భావించి ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా సోమవారం పాతబస్టాండ్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. ధరలపై నియంత్రించలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, నూతలపాటి వెంకటేశ్వర్లు, చల్లా మరియదాసు, అకిటి అరుణ్‌కుమార్‌, మంగా శ్రీనివాస్‌, జంగాల చైతన్య, విజయ్‌కుమార్‌, జగన్నాథం, హనుమంతురావు, వెంకటేశ్వర్లు, నాగరాజు, నాసర్‌జీ, జ్ఞానదీప్‌, రామ్‌ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. 

    

Read more