జూలై 3న భీమవరానికి ప్రధాని మోదీ: విష్ణువర్ధన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-02T23:51:04+05:30 IST

విజయవాడ: ప్రధాని మోదీ జూలై 3వ తేదీ భీమవరంలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పర్యటన పూర్తి వివరాలను ఆయన వివరించారు. ‘‘ ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్

జూలై 3న భీమవరానికి ప్రధాని మోదీ: విష్ణువర్ధన్ రెడ్డి

విజయవాడ: ప్రధాని మోదీ జూలై 3వ తేదీ భీమవరంలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పర్యటన పూర్తి వివరాలను ఆయన వివరించారు. ‘‘ ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10.10గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరానికి 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ  అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాక బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు భారీగా బీజేపీ శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చాం. రాజకీయాలకు అతీతంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. కవులు, కళాకారులు, గాయనీ గాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపాం.’’ అని పేర్కొన్నారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు

‘‘అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించడం లేదు. భారత ప్రభుత్వ సాంస్క్రతిక శాఖ నిర్వహిస్తుంది. రాజకీయ కోణంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూడొద్దు. తెలంగాణా‌కు ప్రధాని మోదీ వస్తే కేసీఆర్ వెళ్లి అహ్వానించకపోవడం దొరతనానికి నిదర్శనం. గతంలో ఇదే పోకడపోయిన వారి పరిస్థితి ఏమైందో ఆయన తెలుసుకోవాలి. రాష్ట్రాభివ‌ృద్ధిపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే ప్రధాని వద్దకు వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన వాటిపై అడిగేవారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగడం లేదా?’’ అని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.  

బస్ చార్జీలు పెంచడం సిగ్గుచేటు.’’ 

‘‘ఏపీలో పెట్రోల్, డీజిల్ తగ్గించకుండా బస్ చార్జీలు పెంచడం సిగ్గుచేటు. ప్రభుత్వ ఉద్యోగుల నిధి ఎక్కడుందో తెలియని పరిస్థితి. అన్ని అంశాలు సజ్జల మాట్లాడితే  ఏపీ మంత్రులు డమ్మీనా? మంత్రి వర్గాన్ని భర్తరఫ్ చేసి అన్ని శాఖలు సజ్జలకు ఆయనకే ఇవ్వొచ్చు కదా. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. ఏపీలో మాత్రం జగన్ రాజ్యాంగం అమలవుతోంది. వైసీపీ అసమర్ధ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.’’ అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.  

Read more