Palnadu: గిరిజన మహిళపై దారుణం..

ABN , First Publish Date - 2022-09-18T16:36:57+05:30 IST

మాచర్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు గిరిజన మహిళపై అత్యాచారం చేసి..

Palnadu: గిరిజన మహిళపై దారుణం..

పల్నాడు జిల్లా (Palnadu Dist.): మాచర్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు గిరిజన మహిళపై  అత్యాచారం చేసి.. హత్య చేశారు. అనుపు చెంచుకాలనీకి చెందిన గిరిజన మహిళ రమావత్ నీలావతి (46) ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. హత్య చేసిన అనంతరం దుండగులు ఆమెను గ్రామ శివారులోని వాగులో పడేశారు. నీలావతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వాగులో శవమై తేలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more