విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-18T06:07:14+05:30 IST

విద్యుతాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మారెళ్ళవారిపాలెం గ్రామంలో జరిగింది.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

నూజెండ్ల, అక్టోబరు 17: విద్యుతాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మారెళ్ళవారిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన జడ అదస్త(22) ఇరవై రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో తన అక్క బావలైన మురికిపూడి రమాదేవి, వసంతరావుల ఇంటికి వచ్చింది. సోమవారం తన అక్క వాళ్ళ గేదెలకు గడ్డి కోసం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో పొలాల్లో జారి ఉన్న విద్యుత్‌ వైరు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త జడ పెద లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

Read more