పరిషత్‌ టీచర్ల సర్దుబాటు వద్దు

ABN , First Publish Date - 2022-12-12T02:10:19+05:30 IST

సర్దుబాటు పేరుతో జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోకి పురపాలక టీచర్లను పంపాలన్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మున్సిపల్‌ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌. రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

పరిషత్‌ టీచర్ల సర్దుబాటు వద్దు

మున్సిపల్‌ టీచర్ల సమాఖ్య డిమాండ్‌

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): సర్దుబాటు పేరుతో జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోకి పురపాలక టీచర్లను పంపాలన్న ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మున్సిపల్‌ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బదిలీల షెడ్యూలు వచ్చినందున జిల్లా పరిషత్‌ టీచర్లే ఆ స్థానాలకు వస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో మునిసిపల్‌ టీచర్లతో సర్దుబాటు చేయొద్దని కోరారు. లేదంటే వెంటనే మున్సిపల్‌ టీచర్లకు కూడా బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2022-12-12T02:10:19+05:30 IST

Read more