గుంటూరు జిల్లా సరికొత్త ప్రయాణం

ABN , First Publish Date - 2022-04-05T06:46:50+05:30 IST

పల్నాడు, బాపట్ల జిల్లాల ఏర్పాటుతో మిగిలిన భూ భాగంతో గుంటూరు జిల్లా ప్రస్థానం సరికొత్తగా ప్రారంభమైంది.

గుంటూరు జిల్లా సరికొత్త ప్రయాణం
సీఎం వర్చువల్‌ జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌..

కోలాహలంగా కలెక్టరేట్‌ 

హాజరైన ప్రజాప్రతినిధులు.. ఉద్యోగులు

 

58 మండలాలు.. 17 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 3 లోక్‌సభ నియోజకవర్గాలతో నిన్నటి వరకు ప్రస్తా నం సాగించిన గుంటూరు జిల్లా సోమవారం నుంచి సరికొత్తగా ప్రయాణం మొదలుపెట్టింది. జిల్లా ల పున ర్వభజనతో గుంటూరు మూడు జిల్లాలుగా మారింది. నూతన జిల్లాల ఆవిర్భావ దినోత్సవాలు అటు నరస రావుపేటలో, ఇటు బాపట్లలో అట్టహాసంగా కార్యక్ర మాలు జరగ్గా గుంటూరులో మాత్రం ఎలాంటి వేడు కలు నిర్వహించలేదు. అయినా కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు వీడి యో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అంతకముందు జిల్లా కలెక్టర్‌గా ఎం వేణుగోపాల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిం చారు. అనంతరం స్పందన కార్యక్రమానికి హాజరై బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. 


గుంటూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పల్నాడు, బాపట్ల జిల్లాల ఏర్పాటుతో మిగిలిన భూ భాగంతో గుంటూరు జిల్లా ప్రస్థానం సరికొత్తగా ప్రారంభమైంది. కొత్త కలెక్టర్‌, జాయింట్‌ కలె క్టర్‌, ఇతర అఽధికారుల సారధ్యంలో పరిపాలనలో తొలి అడుగు వేసింది. సోమవారం ఉదయం సరిగ్గా 9.05 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఆ క్షణం నుంచి బాపట్ల, పల్నాడు జిల్లాలు గుంటూరు నుంచి విడిపోయి కొత్తవిగా ఏర్పడ్డాయి. దీంతో గుంటూరు జిల్లా పరిధితో పాటు సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోయినప్పటికీ పరిపాలనలో నాణ్యమైన సేవలను ప్రజలకు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అధిగమించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కొన్ని గంటల ముందు వివిధ శాఖల్లో సిబ్బంది బదిలీలు జరగడంతో వారంతా ఆదరాబాదరగా తోటి సహచరులు, ఉన్నతాధికారుల కు మొబైల్‌ఫోన్‌ ద్వారా తాము రిలీవింగ్‌ అయి కొత్త జిల్లాలకు వెళుతోన్నామని సందేశాలు పంపారు.


వికేంద్రీకరణతో ప్రజలకు మేలు

కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. దీని వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రారంభోత్స వ వేడుకలో ప్రసంగించిన సీఎం జగన్‌, చీఫ్‌ సెక్రెటరీ సమీర్‌ శర్మ, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజల వద్దకే అనే సేవలు తీసుకెళ్లగలిగామన్నారు. ఇప్పుడు జిల్లాల సంఖ్య పెంపుదలతో మరింత వేగవంతం గా సర్వీసులను డెలివరీ చేయొచ్చ న్నారు. ఇకపై ప్రజలు తమ సమస్యలు నివేదిం చడానికి గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదన్నారు.


కలెక్టరేట్‌లో కోలాహలం

కొత్త జిల్లాల ప్రారంభోత్సవాన్ని వర్చువల్‌ విధానంలో వీక్షిం చేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, అధికారుల రాకతో కలెక్టరేట్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎమ్మెల్సీలు మరుగు డు హన్మంతరావు, డొక్కా మాణిక్యవర ప్రసాద్‌,ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్ధాళి గిరిధర్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కిలారి రోశయ్య, ఉండవల్లి శ్రీదేవి, అన్నా బత్తుని శివకుమార్‌, నూతన కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి, డీఐజీ త్రివిక్ర మ వర్మ, జిల్లా నూతన ఎస్‌పీ ఆరి ఫ్‌ హఫీజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ జీ రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీన, ట్రైనీ కలెక్టర్‌ శుభం బన్స ల్‌, మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాం జనేయులు, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వీ లక్ష్మణరెడ్డి, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం పురుషోత్తం, రాష్ట్ర బలిజ పూసల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కోలా భవాని, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌, స్పెషల్‌ కలెక్టర్‌ వినాయం తదితరులు రావడంతో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కోలాహలం నెలకొన్నది. కొత్త జిల్లాల ఏర్పాటును కర తాళ ధ్వనులతో స్వాగ తించారు. 


సుపరిపాలనే.. లక్ష్యం

కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి బాధ్యతల స్వీకారం

 జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం వేణుగోపాల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకొన్న ఆయన తొలుత కొత్త జిల్లాల ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. అనంతరం జిల్లా 169వ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలన పరంగా సోమవారం నుంచి జిల్లా నూతన అధ్యాయం ప్రారంభమైంది. చరిత్రాత్మక రోజున అతి ముఖ్యమైన గుంటూరు కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన అందిస్తానని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొంటూ పరిపాలనని ముందుకు నడిపిస్తానన్నారు. ప్రజల సమస్యలు, వారి అవసరాలను గుర్తించి ప్రాధాన్యక్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటాం. ఇప్పటికే పరిపాలన సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువైందన్నారు. జిల్లా పరిధి తగ్గడం వలన అందరూ మరింతగా ప్రజలకు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలను వేగంగా ప్రజలకు అందించడమే తన ప్రధాన లక్ష్యంగా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.


కలెక్టర్‌కు ఘన స్వాగతం

అంతకుముందు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన వేణుగోపాల్‌రెడ్డికి జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. జాయింట్‌ కలెక్టర్‌ జీ రాజకుమారి, కలెక్టరేట్‌ ఏవో తాతా మోహన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి స్వాగతం చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలెక్టర్‌ని కలిశారు. 


 వివేక్‌యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌గా విదులు నిర్వహించి సీఆర్‌డీఏ కమిషనర్‌గా బదిలీ అయిన వివేక్‌యాదవ్‌ని నూతన కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి వివేక్‌యాదవ్‌తో కాసేపు ముఛ్చటించారు. 


స్పందనతో పరిపాలనకు శ్రీకారం

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతీ సోమవారం శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగే స్పందన కార్యక్రమానికి వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. నిర్ణీత వ్యవధిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. స్పందన అర్జీలకు అకౌంటబిలిటీ తీసుకొస్తామన్నారు. 


జేసీగా రాజకుమారి బాధ్యతల స్వీకారం

జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌గా జీ రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జేసీ(సచివాలయాలు)గా బాధ్యతలు నిర్వహించిన ఆమెని కొత్త జిల్లాల ఏర్పాటుతో గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. దాంతో సోమవారం ఉదయం 50వ జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీగా ఛార్జ్‌ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. సమస్యలను నాణ్యంగా పరిష్కరించి జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. ఈ సందర్భంగా జేసీ రాజకుమారిని పలువురు తహసీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. 


 

Read more