22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-09-11T05:27:56+05:30 IST

నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్‌ 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత్‌, సెప్టెంబరు 10: నాగార్జున సాగర్‌ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్‌ 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శనివారం నాటికి 588.10 అడుగులు(306.39 టీఎంసీలు) ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, కుడి కాలువ ద్వారా 9900, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33,536, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 22 క్రస్ట్‌గేట్లలో 18 గేట్లను పది అడుగుల మేర, 4 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,48,472 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో 3,94,708  క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,94,708 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.30 అడుగులుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,72,728, రోజా నుంచి 89,408 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 

బ్యారేజి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక 

తాడేపల్లి టౌన్: ప్రకాశం బ్యారేజి వద్ద  ఇప్పటికే అధికారులు జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజి వద్ద శనివారం సాయంత్రానికి 4 లక్షల 33వేల క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్‌లో 12.3 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా, 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు 4లక్షల 22వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతున్నట్టు జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు పశ్చిమ కాల్వలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా అర్ధరాత్రి సమాయానికి వరద ఉధృతి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.  


Updated Date - 2022-09-11T05:27:56+05:30 IST