అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

ABN , First Publish Date - 2022-10-02T05:52:42+05:30 IST

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని గణపవరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి
మృతి చెందిన నవ్యశ్రీ

నాదెండ్ల, అక్టోబరు 1: అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని గణపవరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన సోమరౌతు ప్రసాదు, తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువుకు చెందిన ధనలక్ష్మితో 2011లో వివాహం జరిగింది. వీరిద్దరికి నవ్యశ్రీ(4) అనే చిన్నారి ఉంది. కొంతకాలం తరువాత  భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తర్వాత ధనలక్ష్మి మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ గణపవరం గ్రామంలోని వేలూరు డొంకలో నివాసం ఉంటోంది. కాగా ధనలక్ష్మి కుమార్తె  చిన్నారి నవ్యశ్రీ శుక్రవారం రాత్రి మృతి చెందింది. అయితే భార్య ధనలక్ష్మి, ఆమె ప్రియుడు పిచ్చయ్యలు తన కుమార్తెను చంపారని తండ్రి ప్రసాదు నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తండ్రికి అప్పగించారు.  

Read more