జాతీయ బ్యాంకులకు దీటుగా సహకార సంస్థలు పనిచేయాలి

ABN , First Publish Date - 2022-07-18T06:00:58+05:30 IST

జాతీయ బ్యాంకులకు దీటుగా సహకార సంస్థలు పనిచేయాలని నరసరావుపేట ఎమ్‌పి కృష్ణదేవరాయలు సూచించారు. న

జాతీయ బ్యాంకులకు దీటుగా సహకార సంస్థలు పనిచేయాలి
ప్రసంగిస్తున్న ఎంపీ కృష్ణదేవరాయలు, వేదికపైన డీసీసీబీ చైర్మన్‌ రాము తదితరులు

నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు

గుంటూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ బ్యాంకులకు దీటుగా సహకార సంస్థలు పనిచేయాలని నరసరావుపేట ఎమ్‌పి కృష్ణదేవరాయలు సూచించారు. నగదు రహిత చెల్లింపులను సొసైటీలలో చేపట్టాలన్నారు. రైతులకు జాతీయ బ్యాంకుల్లో ఉండే అన్నిరకాల సాంకేతికసేవలు సహకారసంస్ధల్లో అందాల న్నారు. కలక్టరేట్‌లోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఆదివారం పీఏసీఎస్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సమావేశాన్ని నిర్వ హించారు. ఎంపీ కృష్ణదేవరాయలు తన ప్రసంగాన్ని కొనసాగి స్తూ గూగుల్‌పే, ఫోన్‌పే, అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి నగదు రహి త చెల్లింపులు సొసైటీలలో ప్రవేశపెట్టాలన్నారు. డీసీసీబీ చైర్మన్‌ లాల్‌పురం రాము, సీఈవో కృష్ణవేణి మాట్లాడుతూ సొసైటీలు, బ్రాంచ్‌లలో కంప్యూటరీకరణ పూర్తవుతున్నట్లు తెలిపారు. నగదు రహిత చెల్లింపులను అమలు చేస్తామన్నారు. సమావేశంలో డీసీవోలు వీరాచారి (గుంటూరు), రామారావు (బాపట్ల), నాగశ్రీనివాసరావు (పల్నాడు), వైఈపీ రాష్ట్ర నాయ కుడు గౌతమ్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.


Read more