ప్రకృతి పరిరక్షణలో భాగమే జిందాల్‌ ప్లాంటు

ABN , First Publish Date - 2022-06-07T06:04:41+05:30 IST

పర్యావరణానికి హానిలేకుండా చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా జిందాల్‌ సంస్థ పవర్‌ ప్లాంటు ఏర్పాటు ప్రకృతిని పరిరక్షణలో భాగమే అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

ప్రకృతి పరిరక్షణలో భాగమే జిందాల్‌ ప్లాంటు
సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని

మంత్రి విడదల రజిని

యడ్లపాడు, జూన్‌ 6 : పర్యావరణానికి హానిలేకుండా చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా జిందాల్‌ సంస్థ పవర్‌ ప్లాంటు ఏర్పాటు  ప్రకృతిని పరిరక్షణలో భాగమే  అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో నాయుడుపేట సమీపంలో జిందాల్‌ సంస్థ ఏర్పాటుచేసిన వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంటు ప్రారంభోత్సవం, హరిత నగరాలు పైలాన్‌ను సీఎం మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం మున్సిపల్‌, రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మి, పల్నాడుజిల్లా కలెక్టర్‌ శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ బిందుమాధవ్‌లతో కలసి సీఎం పర్యటన ఏర్పాట్లను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొండవీడు ప్రాంతం నుంచి ప్రకృతి పరిరక్షణకు సంబంధించి, రెండు గొప్ప కార్యక్రమాలు తమ నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  ఇదే సందర్భంలో, హరిత నగరాలు నమూనాలు కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.  అంతకు ముందు రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి గుంటూరు, పల్నాడుజిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ శివశంకర్‌ పవర్‌ ప్లాంటు సమావేశ మందిరంలో అధికారులతో పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసువాలని సూచించారు.  ఆయా కార్యక్రమాల్లో సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌, ఏిపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పోరేషన్‌ ఎండీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌ కీర్తి చేకూరి, జిందాల్‌ పవర్‌ప్లాంటు ఏపీ ప్రెసిడెంట్‌ చారి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌, సీఎం సెక్యూరిటీ వింగ్‌ ఇంటిలిజెన్స్‌ డీఎస్పీ వేణుగోపాలరావు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు శేషిరెడ్డి, రాజకుమారి, అద్దయ్య, తహసీల్దార్‌ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో మాధురి తదితరులు పాల్గొన్నారు. 


Read more