AP News: శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి చర్యలు : మంత్రి కొట్టు సత్యనారాయణ

ABN , First Publish Date - 2022-09-29T23:07:32+05:30 IST

Amaravathi: విజయవాడ, శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. అటవీశాఖ భూముల కారణంగా శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అటవీ, రెవెన్యూ మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో భేటీ అయ్యామని చెప్పారు. 1967లో 115 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖకు అప్పగించిందని అయి

AP News: శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి చర్యలు : మంత్రి కొట్టు సత్యనారాయణ

Amaravathi: విజయవాడ, శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) పేర్కొన్నారు. అటవీశాఖ భూముల కారణంగా శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, సమస్య గురించి అటవీ, రెవెన్యూ మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో భేటీ అయ్యామని చెప్పారు. 1967లో 115 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖకు అప్పగించిందని అయితే హద్దులు నిర్దారించక‌పోవడంతో అటవీశాఖతో దేవాదాయశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.


‘అక్టోబర్ నెలాఖరు‌లోగా సర్వే పూర్తి చేసి హద్దులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. శ్రీశైలం‌లో చౌల్ట్రీల నిర్వహణ‌ను దేవాలయ బోర్డు పరిధి‌లోకి తీసుకువచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నాం. విజయవాడ దుర్గ గుడిలో  డిప్యూటీ సీఎం ముత్యాల‌నాయుడుకు ఎలాంటి అవమానం జరగలేదు. అర్చకులు - పోలీసుల మధ్య ఎలాంటి వివాదం చోటుచేసుకోలేదు’ అని స్పష్టం చేశారు. మూలా నక్షత్రం రోజున లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.  

Updated Date - 2022-09-29T23:07:32+05:30 IST