అక్రమ తవ్వకాలపై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-07T05:57:51+05:30 IST

చెరువులను చెర పడుతున్నారు.. మట్టిని తవ్వుతున్నారు.. తరలిస్తున్నారు.. కాసులు పోగేసుకుంటు న్నారు.. పర్యావరణానికి హానికరంగా మారి న తవ్వకాలపై ప్రజల ఫిర్యాదులను.. ప్రతి పక్షాల ఆందోళనలను ఆలకించేవారే లేరు.

అక్రమ తవ్వకాలపై ఆగ్రహం
చెరువులో మట్టి తవ్విన లోతును కొలత వేస్తున్న మాజీ మంత్రి ఆనందబాబు

వేర్వేరుగా టీడీపీ, సీపీఎం నాయకుల పరిశీలనలు

అక్రమాలకు మంత్రి సమర్ధన శోచనీయం : ఆనందబాబు 

వైసీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారన్న మాజీ మంత్రి

పులిచింతలపాలెం చెరువు మట్టి తవ్వకాలను అడ్డుకున్న సీపీఎం

వేమూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట నాయకుల ఆందోళన


వేమూరు, జూన్‌ 6: చెరువులను చెర పడుతున్నారు.. మట్టిని తవ్వుతున్నారు.. తరలిస్తున్నారు.. కాసులు పోగేసుకుంటు న్నారు..  పర్యావరణానికి హానికరంగా మారి న తవ్వకాలపై ప్రజల ఫిర్యాదులను.. ప్రతి పక్షాల ఆందోళనలను ఆలకించేవారే లేరు. పట్టించుకుని కట్టడి చేసేవారు లేరు. ఈ పరి స్థితుల్లో తాజాగా సోమవారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, సీపీఎం నాయకులు ప్రత్యక్ష కార్యాచరణకు రంగంలో దిగారు.  వే మూరు నియోజకవర్గంలోని చెరువుల్లో య థేచ్ఛగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వేర్వేరుగా పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరులోని మొసలిపా డు చెరువు, భట్టిప్రోలులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మాజీ మం త్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి అండదండలతో అక్రమ మట్టి తవ్వకాలు జరుపు తున్న వైసీపీ నాయకులు లక్షలు ఆర్జిస్తున్నారన్నా రు. నిబంధనలకు పాతర వేసి అక్ర మ తవ్వకాలు చేస్తున్నా మంత్రి సిగ్గులేకుండా సమర్ధించుకోవడం శోచనీయమన్నారు. మట్టి తేవ్వ వారి నుంచి  మంత్రే  స్వయంగా కమీషన్‌ తీసుకుంటున్నారని ఆరోపించారు. తవ్వే ది తవ్వేదే అని మంత్రే ఛాలెంజ్‌లు చేస్తున్నారంటే ఆయన వైఖరి ఏమిటో తెలుస్తుందన్నారు. అక్రమ తవ్వకాలపై ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం దగ్గర్లో ఉందన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు వైసీపీ నాయకులకు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం మామూళ్ల మత్తులో పట్టీపట్టనట్లుగా వ్యహరిస్తున్నదన్నారు. అక్రమ తవ్వకా లపై మైనింగ్‌ ఏడీ స్పందించకుంటే అధికారులపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొసలిపాడు చెరువులో ప్ర మాదకరంగా 41 అడుగుల లోతులో మట్టిని తవ్వేశారన్నారు.  భట్టిప్రోలు మెయిన్‌ డ్రైయిన్‌ లో వేమూరు నుంచి రావికంపాడు, తాడిగిరిపాడు వరకు తవ్వకాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, షేక్‌ అనీఫ్‌, కనగాల మధుసూదనప్రసాద్‌, అమిర్నేని రవి, రాఘవరావు, వేల్పుల రవి, కేసని శివకృష్ణ, కొండ్రు బుల్లియ్య, కన్నెగంటి సురేష్‌, గవిని గణేష్‌, సుధాకర్‌, శేఖర్‌, రాజేష్‌, ప్రసాద్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు. 


 సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన

 వేమూరు పరిధిలోని పులిచింతలపాలెం చెరువులో మట్టి తవ్వకాల ప్రయత్నాలను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. చెరువు వద్ద మట్టి తవ్వకాలకు ప్రయత్నిస్తున్న వారి తో వివాదానికి దిగి హెచ్చరికలు జారీ చేశా రు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా అమృతలూరు మండలం కూచిపూడిలో పేదల సాగులో ఉన్న చెరువులో అక్రమంగా మట్టి తవ్వేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మార్చిలో దేవదాయ శాఖ  చెరువు వేలం పెట్టే సందర్భంలో పేదలు అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా అదే విధంగా అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వేమూరు కార్యదర్శి బి.అగస్టీన్‌ మాట్లాడుతూ చెరువులో నిండుగా నీళ్లు ఉన్నా, చేపలు పెంపకం జరుగుతున్నా కట్టలు తవ్వే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 400 మంది పేదల సాగులో ఉన్న చెరువుపై అధికారుల అండతో కొందరు పెద్దల కన్నువే శారన్నారు.    చెరువు కట్ట మీద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తహసీల్దార్‌ శిరీషకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తోడేటి సురేష్‌, బొనిగల సుబ్బారావు, శ్రీమన్నారాయణ, పులివర్తి రాజు, శ్యాంసన్‌, రమేష్‌, కృష్ణమూర్తి, ఇస్సాకు, సుబ్బారావు, ప్రతిన్‌, మురళీకృష్ణ, మరియదాసు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-07T05:57:51+05:30 IST