సంక్షేమ పథకాలకు సింగిల్‌విండో రుణాలు

ABN , First Publish Date - 2022-06-08T05:14:52+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సింగిల్‌ విండో విధానంలో రుణాలను పంపిణీ చేస్తామని ఏపీ లీడ్‌బ్యాంక్‌ కన్వీనర్‌, యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎం బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

సంక్షేమ పథకాలకు సింగిల్‌విండో రుణాలు
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీజీఎం బ్రహ్మానందరెడ్డి తదితరులు

లీడ్‌బ్యాంక్‌ ఏపీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి

గుంటూరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ  సంక్షేమ పథకాలను సింగిల్‌ విండో విధానంలో రుణాలను పంపిణీ చేస్తామని ఏపీ లీడ్‌బ్యాంక్‌ కన్వీనర్‌, యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎం బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఆజాదికా అమృత మహోత్సవ్‌ ఐకానిక్‌ వారోత్సవాల్లో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరి గిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మో దీ సంక్షేమ పథకాలపై ’సమ్రత్‌’ పోర్టల్‌ను జూమ్‌లో ఆవిష్కరించారు. పేదలకు అమలుచేస్తున్న 13 రకాల కేంద్ర పథకాల వివరాలు పోర్టల్‌లో ఉంటాయని యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం రవికుమార్‌ తెలిపారు. ఎల్‌ డీఎం ఈదర రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు పెద్ద ఎ త్తున రుణాలిస్తున్నట్లు చెప్పారు. సీజీజీబీ చైర్మన్‌ కామేశ్వరరావు, ఎస్‌బీఐ డీజీఎం రవికుమార్‌, ఎల్‌ఐసీ ఆర్‌ఎం విజయలక్ష్మి, బీవోబీ బీజీఎం అమరనాథ్‌రెడ్డి, బ్యాంక్‌ల జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T05:14:52+05:30 IST