కొన్ని పంటలకే ఎందుకు అనుమతిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-13T01:11:36+05:30 IST

జన్యుపరంగా తయారు చేసిన కొన్ని పంటలకు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని, కొన్నింటికి ఎందుకు తిరిస్కరిస్తున్నారన్న కారణాలపై కేంద్రం స్పష్టతనివ్వాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

 కొన్ని పంటలకే ఎందుకు అనుమతిస్తున్నారు
లోక్‌సభలో ప్రసంగిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు, డిసెంబరు12: జన్యుపరంగా తయారు చేసిన కొన్ని పంటలకు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారని, కొన్నింటికి ఎందుకు తిరిస్కరిస్తున్నారన్న కారణాలపై కేంద్రం స్పష్టతనివ్వాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో ఎంపీ ప్రసంగించారు. అనేక జన్యు మార్పిడి పంటలను అనుమతించకపోవటం వల్ల ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు నిలిపోతున్నాయని, కొన్ని పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. గత 8 నెలలుగా కోళ్ళు, రొయ్యల పరిశ్రమలకు మేత ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ నేపథ్యంలో దేశ వ్యవసాయ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు మేతలను దిగుమతి చేసుకోవాలని కోరగా, అవి జన్యుపరంగా మార్పు చెందినవి, దిగుమతి చేసుకోలేమని తెలిపారని పేర్కొన్నారు. కానీ ఇటీవల కాలంలో జేఈఏసీ (జన్యు ఇంజనీరింగ్‌ మదింపు కమిటీ) ఆవాలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇదే సూత్రాన్ని పౌలీ్ట్ర , రొయ్యల వంటి పరిశ్రమలకు వర్తింప చేయాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. రైతులు, పర్యావరణ వేత్తల నుంచి గట్టి వ్యతిరేకత కారణంగా వంకాయ, బంగాళదుంప పంటలు జన్యుపరంగా తయారుచేయబడిన విధానం కింద పంటలుగా గుర్తించలేదన్న విషయాన్ని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-13T01:11:39+05:30 IST