భూముల సర్వే వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-04T05:49:00+05:30 IST

భూముల రీసర్వే జిల్లాలో వేగవంతం చేయాలని సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జీ సాయిప్రసాద్‌ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ని ఆదేశించారు.

భూముల సర్వే వేగవంతం చేయాలి
సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన జిల్లా అధికారులు

సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌

గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే జిల్లాలో వేగవంతం చేయాలని సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జీ సాయిప్రసాద్‌ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ని ఆదేశించారు. గురువారం  వెలగపూడిలోని సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లాలోని గ్రామాలను మూడు విడతల్లో సమగ్ర భూసర్వే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు.  18 నెలల్లో జిల్లాలోని మొత్తం గ్రామాల సర్వే పూర్తి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికని రూపొందించుకొని ముందుకెళ్లాలని సూచించారు. సర్వే పూర్తి అయిన గ్రామాల్లో 13 నోటిఫికేషన్‌ జారీ చేసి రిజిస్ట్రేషన్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సర్వే శాఖ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, కలెక్టరేట్‌ నుంచి వివేక్‌యాదవ్‌, జేసీ రాజకుమారి, డీఆర్‌వో కొండయ్య, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డీసీ భాస్కర్‌నాయుడు, సర్వే శాఖ ఏడీ నాగశేఖర్‌ పాల్గొన్నారు. 

247 మంది ఉద్యోగులకు సర్వే శిక్షణ

జిల్లాలో వివిధ హోదాలు(రెవెన్యూ సబార్డినేట్‌/వీఆర్‌వో/ఏఎస్‌వో) హోదాల్లో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులకు సర్వే శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రెండు బ్యాచ్‌లలో సర్వే శిక్షణ ఇవ్వనున్నారు. 


Read more