Krishnam Raju: అప్పుడు కృష్ణంరాజుకు ఎంత కోపమొచ్చిందంటే.. మైక్‌లో బిగ్గరగా అరిచి..

ABN , First Publish Date - 2022-09-13T01:33:51+05:30 IST

సినీ నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఆదివారం తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా, నేటి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల..

Krishnam Raju: అప్పుడు కృష్ణంరాజుకు ఎంత కోపమొచ్చిందంటే.. మైక్‌లో బిగ్గరగా అరిచి..

గుంటూరు: సినీ నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) ఆదివారం తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా (Gutur District), నేటి గుంటూరు, పల్నాడు (Palnadu), బాపట్ల (Bapatla) జిల్లాల ప్రజలు కృష్ణం రాజుకు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. సినీ, రాజకీయంగా ఆయా ప్రాంతాల్లో కృష్ణంరాజు అడుగు జాడలను ప్రజలు మననం చేసుకుంటున్నారు.



రెంటచింతలలో (Rentachintala) 1996 ఏప్రిల్‌ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి ఎంపీ కాసు కృష్ణారెడ్డి తరుపున కృష్ణంరాజు రోడ్‌షోలో పాల్గొన్నారు. అప్పుడు అసంఖ్యాకంగా ప్రజలు హాజరయ్యారు. కృష్ణంరాజు గంభీర ఉపన్యాసం చేశారు. అనంతరం రెబల్‌స్టార్‌తో కరచలనం(షేక్‌హ్యాండ్‌)కోసం ప్రజలు ఎగబట్టారు. అప్పుడు ఆయన కుడి చేతికున్న పగడపు ఉంగరం మాయమైంది. దీంతో కృష్ణంరాజు జనంపై చిర్రుబుర్రు లాడారు. ‘మీ ప్రాంతానికొస్తే నా ఉంగరాన్నే తస్కరిస్తారా’ అంటూ మైక్‌లో బిగ్గరగా అరిచారని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం నాడు కృష్ణం రాజు అంత్యక్రియలు ముగిశాయి. ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా కృష్ణంరాజుకు అంత్యక్రియలు జరిపించారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగడం గమనార్హం.

Updated Date - 2022-09-13T01:33:51+05:30 IST