ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గిన వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-09-24T05:48:38+05:30 IST

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి వరద నీరు విడుదల తగ్గించడంతో ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉథృతి స్వల్పంగా కొనసాగుతోంది.

ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గిన వరద ఉధృతి
ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు విడుదల అవుతున్న వరదనీరు

దిగువకు 44వేల 500 క్యూసెక్కులు 

తాడేపల్లి టౌన్‌, సెప్టెంబరు23: ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి వరద నీరు విడుదల తగ్గించడంతో ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉథృతి స్వల్పంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 60వేల క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా, 60 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 44వేల 500 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతున్నట్టు నీటిపారుదల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు. అలాగే తూర్పు పశ్చిమ కాలువలకు 15వేల 200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


క్రస్ట్‌గేట్లు మూసివేత

విజయపురిసౌత్‌: ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వరద నీరు తగ్గడంతో ప్రాజెక్ట్‌ అధికారులు శుక్రవారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ క్రస్ట్‌గేట్లను  మూసివేశారు. కాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం శుక్రవారం నాటికి 589.70 అడుగులు ఉంది. ఇది 311.14 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 10,633 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6870 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,704 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 48,407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లోగా 57,629 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 885.00 అడుగులుంది. ఇది 215.80 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 43,610 క్యూసెక్కులు, రోజా నుంచి 8758 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 52,368 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


Read more