త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.85 కోట్లు

ABN , First Publish Date - 2022-11-25T00:46:16+05:30 IST

కార్తీక మాసం పురష్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.1,85,21,768 ఆదాయం వచ్చిందని ఈవో వేమూరి గోపి గురువారం తెలిపారు.

త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.85 కోట్లు
హుండీల లెక్కింపు

కోటప్పకొండలో కార్తీక మాసం హుండీ లెక్కింపు పూర్తి

కోటప్పకొండ(నరసరావుపేట), నవంబరు 24: కార్తీక మాసం పురష్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.1,85,21,768 ఆదాయం వచ్చిందని ఈవో వేమూరి గోపి గురువారం తెలిపారు. దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ 49,00,865, అభిషేకం, పూజా, దర్శనం టిక్కెట్ల విక్రయం, ప్రసాదం ఇతర ఆదాయం రూ 1,53,35,945 వచ్చిందని ఈవో వివరించారు. వెండి 255 గ్రాములు, బంగారం 5.600 గ్రాములు భక్తులు కానుకులుగా సమర్పించారని చెప్పారు. గత ఏడాది కంటే రూ.31,85,823 ఆదాయం పెరిగిందన్నారు. భక్తుల పరోక్ష పూజా టిక్కెట్‌ను రూ.600 నుంచి రూ 1000 పెంచారు. అభిషేకం టిక్కెట్‌ను కూడా రూ.500 నుంచి రూ.1000కి పెంచారు. టిక్కెట్‌ రేట్లు పెంచడంతో దేవస్థాన ఆదాయం కూడా పెరిగిందని చెబుతున్నారు. హుండీల లెక్కింపును ఈవోలు వేమూరి గోపి, టీ సుధాకరరెడ్డి పర్వవేక్షించారు.

Updated Date - 2022-11-25T00:46:16+05:30 IST

Read more